Breaking News

ప్రముఖ ఆలయంలో పుష్ప విలన్‌ ప్రత్యేక పూజలు.. మూవీ ప్రమోషన్స్ కూడా!

Published on Sun, 03/30/2025 - 21:19

పుష్ప విలన్  డాలీ ధనుంజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. పుష్ప సినిమాలో విలన్‌గా మెప్పించిన డాలీ ధనుంజయ్‌.. డాక్టర్ ధన్యత గౌరాక్లర్‌ మెడలో మూడు ముళ్లు వేశారు. మైసూరులో ఏర్పాటు చేసిన భారీ వేదికపై పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వెడ్డింగ్‌ కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ సైతం డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.

అయితే పెళ్లి తర్వాత తొలిసారి తన భార్య ధన్యతతో కలిసి ఆధ్యాత్మిక బాటపట్టారు డాలీ ధనుంజయ్. తన సతీమణితో కలిసి ఉగాది రోజున ప్రముఖ సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతేకాకుండా కన్నడలో తాను నిర్మించిన విద్యావతి అనే మూవీ పోస్టర్‌తో ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. వచ్చేనెల 10న విద్యావతి సినిమా థియేటర్లలో సందడి చేయనుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ‍్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్‌లోనూ అదరగొట్టేశాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)