పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్

Published on Sun, 02/16/2025 - 13:40

పుష్ప విలన్  డాలీ ధనుంజయ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. మైసూరులో ఆయన పెళ్లి వేడుగ ఘనంగా జరిగింది. పుష్ప సినిమాలో విలన్‌గా మెప్పించిన డాలీ ధనుంజయ్‌.. డాక్టర్ ధన్యత మెడలో మూడు ముళ్లు వేశారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పెళ్లికి అభిమానులు సైతం పెద్దఎ‍త్తున పాల్గొన్నారు.

కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ‍్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్‌లోనూ అదరగొట్టేశాడు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ కూడా డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.

పెళ్లి కోసం ప్రత్యేకంగా సెట్..

మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఒక విలాసవంతమైన సెట్‌ను నిర్మించారు. ఫిబ్రవరి 15న సాయంత్రం రిసెప్షన్ జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం..

డాలీ ధనుంజయ్‌కు మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్య, జీవితం, సినిమా పరిశ్రమలోకి ప్రవేశం అన్నీ మైసూర్‌లోనే జరిగాయి. అందుకే మైసూర్‌లోనే వివాహం చేసుకున్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం పొందడానికి చాముండేశ్వరి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను  నిర్మించారు. అలాగే టవర్ ఆకారపు సెట్ పెళ్లికి హైలైట్‌గా నిలిచింది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)