Breaking News

'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?

Published on Tue, 05/28/2024 - 12:47

'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.

(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)

చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎ‍క్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్‌గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)