Breaking News

పాట్నాలో పుష్ప-2 ఈవెంట్‌.. చరిత్రలోనే తొలిసారి అలా!

Published on Sun, 11/17/2024 - 16:23

మరికొన్ని గంటల్లో పుష్ప రాజ్‌ సందడి చేయనున్నాడు. బిహార్‌లోని పాట్నాలో నిర్వహించే భారీ ఈవెంట్‌లో పుష్ప-2 ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. నగరంలోని గాంధీ మైదానంలో ఈవెంట్‌ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే ఈవెంట్‌ను అక్కడి ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు లేని విధంగా ఏకంగా 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీని కేటాయించింది. అయితే ఒక ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌కు బిహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్‌కు నార్త్‌లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. 

పాట్నా నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్‌ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)