చీర కట్టుకోవాలంటే భయమేసింది, నటుడిగా 5.5 మార్కులే..: అల్లు అర్జున్‌

Published on Sun, 02/23/2025 - 16:10

తగ్గేదేలె అన్న డైలాగ్‌ను సినిమాలోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్‌ (Allu Arjun). పుష్ప 2 చిత్రంతో ఏకంగా రూ.1871 కోట్లు సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. అలాగే ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా మ్యాగజైన్‌ తొలి సంచికపై కనిపించిన మొట్టమొదటి భారతీయ హీరోగా అరుదైన ఘనత సాధించాడు. ఈ కవర్‌ పేజీ షోటషూట్‌ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

భయపడ్డా..
అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. గంగమ్మ జాతర సన్నివేశంలో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను మొదట భయపడ్డాను. ఇది వర్కవుట్‌ కాదేమో అన్నాను. కానీ సుకుమార్‌ (Sukumar) మాత్రం ఆ సన్నివేశంలో నువ్వు చీర కట్టుకుని అమ్మాయిగా కనిపించాలంతే అన్నాడు. అందుకోసం మొదట డ్రాయింగ్స్‌ వేశారు. నాకు ఏ లుక్‌ సూటవుతుందని పరీక్షించారు. తర్వాత నెమ్మదిగా నాలోనూ నమ్మకం మొదలైంది. ‍కచ్చితంగా ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనిపించింది. 

నటుడిగా ఐదున్నర మార్కులు
అదే సమయంలో ఇది నాకెంతో ఛాలెంజింగ్‌గానూ అనిపించింది. ఎందుకంటే చీర కట్టినా కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాలి. ఫైనల్‌గా ఆ సీన్‌ అనుకున్నట్లుగానే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ అయిందని నేను గర్వాన్ని తలకెక్కించుకోలేదు. నటుడిగా నాకు 10కి 5.5 మార్కులు వేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. పుష్ప 2 (Pushpa 2 The Rule) విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. సుకుమార్‌ దర్శకత్వం వహించగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు.

చదవండి: దుబాయ్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు.. అఖిల్‌ 'నాటు నాటు' స్టెప్పులు

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)