Breaking News

'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ

Published on Tue, 12/10/2024 - 17:42

'పుష్ప 2' మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. రోజురోజుకీ వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రం.. ఐదో రోజు పూర్తయ్యేసరికి రూ.1000 కోట్ల మార్క్ దాటేస్తుందని అనుకున్నారు. కానీ కాస్త దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సోమవారం.. వర్కింగ్ డే కావడంతో ఓ మేరకు వసూళ్లు తగ్గాయి. ఇంతకీ ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్ ఎంత?

(ఇదీ చదవండి: 'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది!)

తొలి వీకెండ్‌‌ని అద్భుతంగా ముగించిన 'పుష్ప 2'కి ఆదివారం ముగిసేసరికి రూ.829 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ కావడంతో దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ కళకళాలాడిపోయాయి. అయితే సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉదయం షోలతో పోలిస్తే ఈవినింగ్ షోలు ఫూల్ అయ్యాయి. దీంతో ఐదోరోజు కేవలం రూ.97 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ మేరకు అధికారికంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఓవరాల్‌గా చూసుకుంటే ఐదు రోజుల్లో 'పుష్ప 2' సినిమాకు రూ.922 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే మంగళవారం వసూళ్లతో రూ.1000 కోట్ల రౌండ్ ఫిగర్ అవుతుందా లేదంటే బుధవారం వరకు ఎదురుచూడాలా అనేది మరో రోజు గడిస్తే తేలుతుంది. నాలుగంకెల నంబర్ మరో ఒకటి రెండు రోజుల్లో దాటేస్తుంది గానీ లాంగ్ రన్‌లో ఎన్ని వందల కోట్లు వస్తాయనేది ఇప్పుడు అందరికి వస్తున్న సందేహంగా మారింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)