Breaking News

టైట్ సెక్యూరిటీ మధ్య స్టార్‌ హోటల్‌లో 'పుష్ప' ఫైనల్‌ టచ్‌

Published on Sat, 02/08/2025 - 12:50

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ల యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో ఎన్నో  రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. అయితే, సినిమా ప్రీమియర్‌ సమయంలో జరిగిన తొక్కిసలాటతో సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలు జరపలేదు. అయితే, పుష్ప2 థియేటర్‌ రన్‌ కూడా పూర్తి అయింది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులోకి కూడా వచ్చేసింది. దీంతో సినిమా చిత్ర యూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విజయంలో కీలకంగా పనిచేసిన పుష్ప2 నటీనటులతో పాటు టెక్నీషయన్లతో ఫైనల్‌ టచ్‌గా ఒక థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని  ఒక స్టార్‌ హోటెల్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 8) సాయింత్రం పుష్ప2 థ్యాంక్స్‌ మీట్‌ జరగనుంది.  టైట్ సెక్యూరిటీ మధ్య చాలా లిమిటెడ్‌గా ఆహ్వానాలు పంపారు. సినిమా కోసం పనిచేసిన అందరికీ షీల్డ్‌లు అందించి వారిని సత్కరించనున్నారు. పుష్ప2తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడనున్నాడోనని తెలుసుకునేందుకు ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే, సంధ్య  థియేటర్ ఘటన గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవచ్చని తెలుస్తోంది. కేవలం తన  తర్వాతి సినిమాల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని సమాచారం ఉంది.

పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)