Breaking News

పుష్ప-2 పై రూమర్స్.. డైరెక్టర్‌ సుకుమార్‌ పోస్ట్ వైరల్!

Published on Mon, 01/29/2024 - 15:35

ఐకాన్‌ స్టార్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్ప సీక్వెల్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందని చాలా సార్లు వార్తలొచ్చాయి. వీటిపై డైరెక్టర్‌ సుకుమార్‌ క్లారిటీ కూడా ఇచ్చారు. పుష్ప-2 రిలీజ్ తేదీలో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. 

ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సుకుమార్. 'పుష్ప రాజ్ రూల్ బిగిన్స్‌ ఇన్ 200 డేస్' అంటూ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దీంతో వాయిదా అంటూ రూమర్స్ వైరలవుతున్న వేళ మరోసారి క్లారిటీ ఇచ్చిపడేశారు. తాజాగా డైరెక్టర్‌ చేసిన పోస్ట్‌తో పుష్ప-2పై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పడినట్లే. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా.. గతేడాది ఎవరూ ఊహించని విధంగా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టు కావడంతో అనుకున్న సమయంలో సినిమా విడుదల కాకపోవచ్చనే వార్త ప్రచారం జరిగింది.

గతంలో అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్‌'2021లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. ఇందులో రష్మిక నటించిన శ్రీవల్లి పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇందులో  ఫహద్ ఫాజిల్ కొద్దిసేపు మాత్రమే కనిపించారు. పార్ట్‌-2లో ఆయన ఎక్కువ సేపు కనిపిస్తారని టాక్‌ ఉంది. పార్ట్‌-1కు వచ్చిన ఆదరణ చూసిన మేకర్స్‌ ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్‌- 1కు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)