Breaking News

'పుష్ప 2'కు పోటీగా దిగుతున్న కీర్తి సురేష్‌

Published on Fri, 05/31/2024 - 15:49

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నేను శైలజతో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కీర్తి.. కెరీర్‌ ఆరంభమైన కొన్నాళ్లకే 'మహానటి'గా  నిరూపించుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె.

ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రఘు తాత’. సుమన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. అయితే, తాజాగా రఘు తాత నుంచి టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ క్రమంలో ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అదే రోజున పాన్‌ ఇండియా చిత్రం అల్లు అర్జున్‌ నటించిన పుష్ప కూడా విడుదల కానుంది. 

'మహానటి' చిత్రానికి గాను కీర్తి సురేష్‌ నేషనల్‌ అవార్డు అందుకుంటే.. అల్లు అర్జున్‌ కూడా పుష్ప చిత్రం ద్వారా నేషనల్‌ అవార్డు అందుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం కానుక‌గా ఆగ‌ష్టు 15న పుష్ప, రఘు తాత రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఇద్దరు నేషనల్‌ అవార్డ్స్‌ అందుకున్న స్టార్స్‌ ఒకేరోజున బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడనున్నారు. వాస్తవానికి కమల్​ హాసన్‌ నటించిన​ ఇండియన్ 2 కూడా ఆగష్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ, పుష్ప 2 వల్ల దానిని విరమించుకున్నారు. అయితే, రఘు తాత చిత్రంతో కీర్తి సురేష్‌ బన్నీ సినిమాకు పోటీగా రేసులోకి దిగుతుంది. 

ఈ చిత్రంలో ఆమె NCC క్యాడెట్ శిక్షణలో ఉంటుంది. హిందీలో శిక్షణ ఇస్తుంటే తనకు హిందీ రాదని తమళంలో చెప్పాలని కోరుతుంది. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ ఇప్పటికే తమిళ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్‌లో రఘు తాత చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)