Breaking News

నేషనల్‌ అవార్డ్‌ సినిమా నిర్మాతకు వడ్డీ వ్యాపారుల వేధింపులు

Published on Sat, 06/29/2024 - 20:32

కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత కాపాడాలంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. తనను వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ నిర్మాత పుష్కర్‌ మల్లికార్జునయ్య సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ పరిశ్రమలో ఆయన సుమారు 20కి పైగా చిత్రాలు నిర్మించారు. హీరో రక్షిత్‌ శెట్టితో 'అతడే శ్రీమన్నారాయణ' చిత్రానికి పుష్కర్‌ మల్లికార్జునయ్య నిర్మాతగా ఉన్నారు. కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన రష్మిక మందన్న,రక్షిత్‌ శెట్టి నటించిన 'కిరిక్‌ పార్టీ' చిత్రానికి కూడా ఆయన పెట్టుబడిపెట్టారు. 

2021లో మలయాళం భాషలో ఆయన నిర్మించిన  'థింకలజచ్చా  నిశ్చయం' (Thinkalazhcha Nishchayam) అనే చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. మలయాళంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డును దక్కించుకుంది. 'సోనీ లివ్‌' ఓటీటీ వేదకగా ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇలా ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన ఆయనకు చిత్రపరిశ్రమలో నష్టాలు మిగలడంతో వడ్డీ వ్యాపారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

రూ. 5 కోట్ల అప్పు కోసం రూ. 11.5 కోట్లు ఇచ్చినా కూడా..
వడ్డీ వ్యాపారుల నుంచి తనకు తీవ్రమైన వేధింపులు ఉన్నాయని పుష్కర్‌ మల్లికార్జునయ్య ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కొన్ని సినిమాలు ఆశించిన మేర విజయం సాధించకపోవడం, కోవిడ్‌ సమయంలో నష్టాలు అనుభవించిన పుష్కర్‌ మల్లికార్జునయ్య 2019 నుంచి 2023 వరకు బంధువు ఆదర్శ్‌ డీ.బీ. అనే వ్యక్తి నుంచి దశలవారీగా రూ.5 కోట్ల రుణం తీసుకున్నాడు. ప్రతినెల 5 శాతం వడ్డీ డబ్బు నగదు రూపంలో ఇచ్చాడు. రూ.5 కోట్లు అసలు, వడ్డీ సమేతంగా ఇప్పటి వరకు మొత్తం రూ.11.50 కోట్లు చెల్లించాడు. 

అయితే చెల్లించిన డబ్బు కేవలం వడ్డీ, చక్రవడ్డీకి సరిపోతుంది, ఇంకా రూ.13 కోట్లు ఇవ్వాలని ఆదర్శ్‌ డిమాండ్‌ చేశాడు. అంతేగాక ఆదర్శ్‌, హర్ష, శివు, హర్ష మరికొంత మంది అనుచరులతో కలిసి తన ఇళ్లు, కార్యాలయానికి వచ్చి అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని పుష్కర్‌ ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం సీసీబీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ కిశోర్‌కుమార్‌కు నిర్మాత పుష్కర్‌ ఫిర్యాదు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)