Breaking News

రాజా సాబ్‌తో పూరి సాబ్‌

Published on Wed, 07/30/2025 - 03:56

హీరో ప్రభాస్, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్‌ నిరంజన్‌’(2009) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రానుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు ప్రభాస్‌ కానీ, అటు పూరి జగన్నాథ్‌ కానీ ఎక్కడా స్పందించ లేదు. ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుసపాన్‌ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్‌’, ‘ఫౌజి’(వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమాల్లో నటిస్తున్నారు.

ఇక విజయ్‌ సేతుపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్‌. కాగా ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లోకి పూరి జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్, పూరి, చార్మీ కలిసి మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాజా సాబ్‌తో పూరి సాబ్‌ అంటూ నెటిజన్స్‌ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.  పుట్టినరోజు ప్రత్యేకం... ‘ది రాజా సాబ్‌’ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(జూలై 29) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ చిత్రం నుంచి సంజయ్‌ దత్‌ ప్రత్యేక ΄ోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.
 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)