Breaking News

ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు

Published on Mon, 07/27/2026 - 23:45

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలైన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో  హిట్‌ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆయన కమ్‌బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె పూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లో.. అప్పట్లో 'పూరి' ఒక వ్యక్తిని బాగా నమ్మాడు. కానీ ఆ వ్యక్తి చేసిన మోసం వల్ల ఆయనకు భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఆ అప్పులు తీర్చేందుకు ప్రతి నెలా రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. దాంతో చివరికి పూరి ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఆఫీస్‌ను కూడా అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత అద్దె ఆఫీస్‌లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘు కుంచె తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. 


అప్పట్లో ఓ ఇంటర్వూలో పూరి కూడా ఈ విషయంపై స్పంధించారు. అప్పుడు నేను ప్రభాస్‌, గోపీచంద్‌, అమితాబ్‌ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాను. కానీ వచ్చే డబ్బు మాత్రం అప్పులకు వడ్డీలు చెల్లించేవాడిని. ఆ సమయంలో పెంపుడు జంతువులను కూడా ఫీడ్‌ చేయలేక ఇతరులకు ఇచ్చేశాను. ఆ సమయంలో మొదటిసారి ఏడ్చాను. నా డబ్బు పోయినదానికంటే ఆ విషయంలో నేను ఎక్కువ బాధపడ్డానని పూరి చెప్పారు.


ఇక పూరి జగన్నాధ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఈ సినిమా కీలక మలుపు అవుతుందనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)