Breaking News

ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కె' టైటిల్‌, గ్లింప్స్‌ విడుదల.. హాలీవుడ్‌ రేంజ్‌లో సీన్స్‌

Published on Fri, 07/21/2023 - 06:57

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న టైమ్‌ట్రావెల్‌ సైన్స్ ఫిక్షన్  ఫిల్మ్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ టైటిల్‌,గ్లింప్స్‌ను  ‘కామిక్‌ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్‌ విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ , అమితాబ్‌ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ప్రాజెక్ట్‌ కె' రివీల్‌ అయింది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భవిష్యత్‌లోకి తీసుకెళ్తుంది. అందుకే దీనిని  టైమ్‌ట్రావెల్‌ సైన్స్ ఫిక్షన్‌లో తీస్తున్నారు.

ప్రభాస్‌  'కల్కి 2898 AD' గ్లింప్స్‌ ట్రీట్‌ (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన తొలి హీరో ప్రభాస్‌నే.. ఇప్పుడు హాలీవుడ్‌ రేంజ్‌లో కల్కి గ్లింప్స్‌ ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే హలీవుడ్‌లో ప్రభాస్‌ ఆగమనం ఖాయంగానే ఉంది. ప్రభాస్‌ పోస్టర్‌ను విడుదల చేసిన వైజయంతి మూవీస్‌పై ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అయ్యారు. వాస్తవంగా అది అంతగా ఆకట్టుకోలేదు.

తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌ మాత్రం అదిరిపోతుంది. ఫ్యాన్స్‌ను నాగ్‌ అశ్విన్‌ ఏమాత్రం నిరాశపరచలేదు. అదొక వండర్‌లా కల్కిని క్రియేట్‌ చేశాడని చెప్పవచ్చు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌లో కూడా సంతోష్‌ నారాయణ్‌ రచ్చలేపాడని చెప్పవచ్చు. ఇందులో  విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయింది. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక  ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’  వేడుకలో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డుకెక్కింది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)