మైత్రి మూవీస్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ,లక్ష్మీనారాయణల సినిమా

Published on Tue, 06/06/2023 - 16:51

డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి  నిర్మించిన చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి  ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో  గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో ... నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ , సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ , సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది. ఈ మధ్య "భీమదేవరపల్లి బ్రాంచి" ప్రివ్యూ షో  చూసిన సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు.. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాల మీద ప్రశంసలు కురిపించారు.

(ఇదీ చదవండి: ఆ చిత్రం రీమేక్‌లో నాగచైతన్య.. క్లారిటీ ఇచ్చిన టీం!)

‘భీమదేవరపల్లి బ్రాంచి" ఒక ఆర్గానిక్ గ్రామీణ  చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన  సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్  ఆధారంగా ఈ సినిమాను "నియో రియలిజం" జానర్లో చిత్రీకరించారు. ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది. ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించగా ఈ సినిమా కంటెంట్ నచ్చి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

(ఇదీ చదవండి: రజనీ కాంత్‌ కాదన్న బాబీకి గోల్డెన్ ఛాన్స్‌ ఇచ్చిన బాలకృష్ణ?)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)