Breaking News

‘కల్కి’ కంటే ముందే శంబాల టైటిల్‌ని ఫిక్స్‌ చేశాం

Published on Sun, 12/21/2025 - 10:39

‘‘శంబాల’ సినిమాకి ముందు ఆదితో వేరే కథ అనుకున్నాం. ఇంతలో ‘శంబాల’ కథ రావడంతో ఈ కథతోనే సినిమా చేద్దాం అనుకున్నాం. యుగంధర్‌ ముని చెప్పిన ఈ కథ అంత బాగా నచ్చింది. డివోషనల్, హారర్‌ ఎలిమెంట్స్‌ కనెక్ట్‌ కావడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి, సినిమా ఆరంభించాం’’ అని నిర్మాతలు రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి తెలిపారు.

 ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్‌ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీతో మాకు అనుబంధం ఉంది. పెద్ద సినిమాల వీడియో డీవీడీస్‌ హక్కులు మా వద్ద ఉండేవి. అలాగే ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌గా పని చేశాం. నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రం. ఇందులో హారర్‌తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్‌ ఉంటాయి. 

‘కల్కి 2898 ఏడీ’ వచ్చిన తర్వాత ‘శంబాల’ (కల్కిలో శంబాల ప్రపంచం ఉంటుంది) గురించి అందరికీ తెలిసింది. అయితే అంతకు ముందే మేం ఈ టైటిల్‌ని ఫిక్స్‌ చేశాం. కథపై నమ్మకంతో బడ్జెట్‌ ఎక్కువైనా రాజీ పడలేదు. మా పెట్టుబడిలో 80 శాతం వరకు బిజినెస్‌తో సేఫ్‌ జోన్‌లోకి వచ్చాం.. ఆది, అర్చనా అయ్యర్‌తో పాటు సినిమాలో అన్ని పాత్రలకి ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం మా సినిమాకు పెద్ద ప్లస్‌. తెలుగులో రిలీజ్‌ అయిన వారం రోజుల్లో హిందీలో విడుదల చేస్తాం. మా తర్వాతి సినిమాల కోసం కొన్ని కథలు వింటున్నాం. డిస్ట్రిబ్యూషన్‌  కూడా కంటిన్యూ చేస్తున్నాం’’ అని చెప్పారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)