Breaking News

అందుకే పదిహేనుకే వస్తున్నాం: టీజీ విశ్వప్రసాద్‌

Published on Sun, 08/11/2024 - 00:09

‘‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ప్రారంభించినప్పుడే మే లేదా జూన్‌లోగా పూర్తి చేసి, ఆగస్ట్‌ 9న విడుదల చేయాలనుకున్నాం. అయితే సాంగ్స్‌ షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో ఆ తేదీన రిలీజ్‌ చేయలేదు. అలాగే ‘పుష్ప 2: ది రూల్‌’ రిలీజ్‌ వాయిదా పడటంతో ఆగస్ట్‌ 15 సరైన తేదీ అని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ అన్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జోడీగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘రవితేజగారితో మేం నిర్మించిన ‘ధమాకా’ మంచి హిట్టయింది.

‘ధమాకా’కి ప్లస్‌లా ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఉంటుంది. హరీష్‌ శంకర్, రవితేజలది క్రేజీ కాంబినేష్‌. ‘మిస్టర్‌ బచ్చన్‌’ కంప్లీట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో వినోదం, మాస్, యాక్షన్‌.. ఇలా అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. హరీష్‌కి, మిక్కీ జె. మేయర్‌కి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్‌ కావాలో అంత గ్రాండ్‌ ఔట్‌పుట్‌ తీసుకొచ్చారు. పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. ఆగస్ట్‌ 15కి తెలుగులో రెండు పెద్ద సినిమాలు ‘మిస్టర్‌ బచ్చన్, డబుల్‌ ఇస్మార్ట్‌’ వస్తున్నాయి.

థియేటర్ల పరంగా ఈ రెండింటికీ ఎలాంటి సమస్య రాదు. పైగా లాంగ్‌ వీకెండ్‌ ప్లస్‌ అవుతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై తెలుగుతో పాటు హిందీ, కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నాం. మా సంస్థ నుంచి దాదాపు 15 సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిలో కన్నడంలో మూడు సినిమాలు, హిందీలో బాబీ డియోల్‌తో ఒక సినిమా, రెండు ఇంగ్లిష్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్‌’ షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. ఈ ఏడాదిలోపు చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)