Breaking News

ఆ విషయంలో మేము పాస్‌ అయ్యాం : నాగవంశీ

Published on Wed, 07/30/2025 - 17:19

‘ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము(కింగ్‌డమ్‌) పాస్ అయ్యాం. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్‌’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

 ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది." అన్నారు.

 విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘జెర్సీ' సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి 'కింగ్‌డమ్' ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు 'కింగ్‌డమ్' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది." అన్నారు. ‘విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని భాగ్యశ్రీ బోర్సే అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)