Breaking News

ఏంటి..నన్ను మిస్‌ అవుతున్నారా? : నాగవంశీ

Published on Thu, 08/21/2025 - 08:55

ఒక సినిమాని ప్రమోట్‌ చేయాలంటే హీరోహీరోయిన్లు రంగంలోకి దిగాల్సిందే. వాళ్లు ప్రచారం చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎక్కువగా నటీనటులతోనే మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు పెడుతుంటారు. వీరితో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. కానీ వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు అంతగా వైరల్‌ కావు. కానీ ఈ నిర్మాత మాత్రం కాస్త స్పెషల్‌. ఆయన ఏం మాట్లాడినా.. ట్వీట్‌ చేసిన క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. 

హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ.. పక్కన ఆయన ఉంటే మీడియా ఫోకస్‌ అంతా అటువైపే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చెప్పే విషయాలు, ఇచ్చే హైప్‌ మామలుగా ఉండదు. కొన్నిసార్లు అవసరానికి మించిన హైప్‌ ఇచ్చి.. ట్రోలింగ్‌కి కూడా గురవుతుండాడు. ఆయనే యంగ్‌ ప్రొడ్యూసర్‌ సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi ).

సితారఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వరుస సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. మొన్నటి వరకు వరుస విజయాలను చూసిన నాగవంశీకి ఇటీవల మాత్రం దెబ్బ మీద దెబ్బలు తాకుతున్నాయి. ఆయన నిర్మించిన చిత్రాలతో పాటు భారీ ధరకు కొనుగోలు చేసిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. 

ఆయన బ్యానర్‌ నుంచి భారీ అంచనాలతో రిలీజైన ‘కింగ్డమ్‌’ మూవీకి హిట్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్స్‌ మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేకపోయింది. ఇక భారీ ధరకు కొనుగోలు చేసిన వార్‌ 2 చిత్రం కూడా నాగవంశీకి నష్టాలనే మిగిల్చింది. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వంశీ​... వార్‌ 2 రిలీజ్‌ తర్వాత సైలెంట్‌ అయిపోయాడు. ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతున్నా స్పందించలేదు. ఒకనొక దశలో సోషల్‌ మీడియాను దూరం పెట్టాడనే పుకార్లు కూడా వచ్చాయి.  

అయితే అందులో వాస్తవం లేదని వంశీ క్లారిటీ ఇచ్చాడు.  అంతేకాదు తనను ట్రోలింగ్‌ చేస్తున్నవారికి కూడా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్లడం లేదని, ఇంకో 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. 

' ఏంటి.. నన్నుచాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ తో ఫుల్ల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు. ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. కానీ, ఇంకా ఆ సమయం రాలేదు. మినిమమ్ 10 నుంచి 15 ఏళ్లు ఉంది. సినిమాలోనే.. సినిమా కోసం ఎల్లప్పుడూ. మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్లీ కలుద్దాం ' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)