Breaking News

తెలుగమ్మాయిలకు ఛాన్స్‌ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్‌.. ఆయన రిప్లై ఇదే!

Published on Mon, 02/17/2025 - 17:41

'టాలీవుడ్‌లో తెలుగు వచ్చిన అమ్మాయిలకన్నా తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్‌ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది. అందుకని ఇక మీదట తెలుగురానివారిని ఎంకరేజ్‌ చేయాలని నేను, డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ (Sai Rajesh) నిర్ణయించుకున్నాం' అంటూ నిర్మాత ఎస్‌కేఎన్‌ (Producer SKN) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చివరిగా నిర్మించిన సినిమా బేబీ. అందులో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్‌గా పరిచయం చేయడంతో.. ఆమెకు బేబీ టీమ్‌కు మధ్య విభేదాలు వచ్చాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఆరుగురు తెలుగమ్మాయిలను..
నిజానికి ఎస్‌కేఎన్‌ దాదాపు ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్స్‌గా మార్చాడు. 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మ రాథోడ్‌, ఆనంది, 'రొమాన్స్‌'తో మానస, 'టాక్సీవాలా'తో ప్రియాంక జవాల్కర్‌ (దీనికంటే ముందు కల వరం ఆయే సినిమా చేసింది కానీ గుర్తింపు రాలేదు), 'బేబి'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేశాడు. సంతోశ్‌ శోభన్‌తో తీస్తున్న సినిమాలో దేత్తడి హారికను కూడా కథానాయికగా పరిచయం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తూ.. ఎస్‌కేఎన్‌.. చాలామంది తెలుగు హీరోయిన్లకు తెరకు పరిచయం చేశారు. 

కవర్‌ డ్రైవ్‌
ఫన్‌ కోసమో, ఫ్లోలోనో వివాదానికి దారితీసేలా స్టేట్‌మెంట్‌ పడేశారు. కానీ దాన్ని హీరోయిన్‌ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో? అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్‌కేఎన్‌ స్పందిస్తూ..  హహ్హహ్హ.. ఈ మధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ.. ఏం చేస్తాం చెప్పండి! అని రిప్లై ఇచ్చాడు. కాంట్రవర్సీ మీరే చేసి ఇప్పుడు కవరింగ్‌ దేనికో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: లాజిక్‌ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్‌హిట్టు: కరణ్‌ జోహార్‌

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)