Breaking News

నాటకాలా? నువ్వు, నీ ఫ్రెండ్‌ రాజమౌళి రోడ్డుమీద కొట్టుకోండి: నిర్మాత ఫైర్‌

Published on Fri, 02/28/2025 - 17:42

టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి (SS Rajamouli)పై ఆయన సన్నిహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇద్దరూ ఒకమ్మాయినే ప్రేమించగా రాజమౌళి కోసం తన ప్రేమను త్యాగం చేశానన్నాడు. అతడి కోసం 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నానని.. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీని సినిమాగా తీస్తానన్నానో అప్పటి నుంచి తనను టార్చర్‌ పెట్టడం ప్రారంభించాడని ఆరోపించాడు. రాజమౌళి వల్ల తన ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయాడు.

ఫ్రెండ్‌ అయితే చెవిలో చెప్పాలి!
ఈ ఆరోపణలపై టాలీవుడ్‌ నిర్మాత నట్టి కుమార్‌ (Natti Kumar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రాజమౌళి స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పుడొచ్చి ఇదంతా చెప్పడం కరెక్ట్‌ కాదు. నిజంగా ఫ్రెండ్‌ అనుకుంటే వెళ్లి చెవిలో చెప్పాలి. అయినా ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఎందుకంటే.. ఎప్పుడో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ చేశాం. రాజమౌళి కోసం ప్రేమ త్యాగం చేసి అతడి దగ్గరే అనుచరుడిగా పని చేశానన్నాడు. సడన్‌గా ఇలా మాట్లాడుతున్నాడంటే.. డబ్బు దగ్గర సమస్య వచ్చిందా?

(చదవండి: డ్రాగన్ సక్సెస్‌.. టాలీవుడ్ యంగ్‌ హీరోతో ఛాన్స్‌ కొట్టేసిన ముద్దుగుమ్మ!)

పిచ్చిపిచ్చి నాటకాలా?
ఆయన చేసిన అభియోగాలకు ఏదైనా సాక్ష్యం ఉందా? నేను రాజమౌళికి సపోర్ట్‌ చేయడం లేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి బెదిరిస్తే పోలీసు దగ్గరకు వెళ్లొచ్చు. కానీ ఇలా బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్‌ కాదని నా అభిప్రాయం. ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు.. కానీ 34 ఏళ్లుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడటం తప్పు. ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు పుట్టి, మనవళ్లు కూడా ఉండొచ్చు. ముసలాడివయ్యాక ఇప్పుడు లవ్‌స్టోరీ గుర్తొచ్చి బయటపెడతావా? పిచ్చిపిచ్చి నాటకాలా? అమ్మాయితో ఆడుకుంటారా? ఏమైనా ఉంటే మీరిద్దరూ చూసుకోండి..

రోడ్డుమీద పడి కొట్టుకోండి..
అమ్మాయి మనోభావాలు దెబ్బతినేవిధంగా, ఆమెకు ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడటం తప్పు. మీరిద్దరూ మాట్లాడుకోండి, తిట్టుకోండి, అవసరమైతే రోడ్డుపై కొట్టుకోండి.. కానీ అమ్మాయిని రోడ్డు మీదకు లాగడం కరెక్ట్‌ కాదు. ఆయన నిజంగా ఆమెను ప్రేమించి ఉంటే తనను ఇబ్బందిపెట్టడం శ్రేయస్కరం కాదు. ఆమెకు నానమ్మ వయసొచ్చాక ఈ విషయాలు చెప్తారా? ఏంటిది? ఇవన్నీ పిచ్చిపిచ్చి వేషాలు అని నట్టికుమార్‌ మండిపడ్డాడు.

చదవండి: ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్‌..: శివరాజ్‌కుమార్‌

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)