Breaking News

'గుంటూరు కారం' విషయంలో బాధంతా వాళ్లదే: నిర్మాత నాగవంశీ

Published on Tue, 03/19/2024 - 11:06

ఈసారి సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలోని హ్యాట్రిక్ మూవీ ఇది. విడుదలకు ముందు ఫ్యాన్స్.. ఓ రేంజు అంచనాలు పెంచేసుకున్నారు. కానీ టాక్ రివర్స్ అయిపోయింది. రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టుకుంది కానీ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే విషయంలో నిరాశపరిచింది. తాజాగా ఓ ఈవెంట్‌లో 'గుంటూరు కారం' మూవీ గురించి ప్రశ్న ఎదురవగా.. నిర్మాత నాగవంశీ విచిత్రమైన సమాధానమిచ్చారు.

(ఇదీ చదవండి: బోల్డ్‌నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్)

'గుంటూరు కారం సినిమా విషయంలో మాకు ఎలాంటి బాధలేదు. బాధంతా కూడా మీడియాదే' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పెట్టిన డబ్బులొచ్చేయని అన్నట్లే. కానీ రియాలిటీ చూసుకుంటే ఈ మూవీ మహేశ్ అభిమానులే చాలామందికి నచ్చలేదు. అలానే సినిమాని కొన్న చాలామంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారని సమాచారం. కానీ నాగవంశీ మాత్రం మీడియా బాధంతా అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది. అలానే త్రివిక్రమ్-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అప్‌డేట్ గురించి అడగ్గా.. మరో ప్రెస్‌మీట్ లో చెబుతానని మాట దాటవేశారు.

సితార సంస్థ నుంచి త్వరలో రాబోతున్న మూవీ 'టిల్లూ స్క్వేర్'. 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‌గా తీసిన ఈ మూవీలో సిద్ధు, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించారు. మల్లిక్ రామ్ దర్శకుడు. తొలి భాగంతో పోలిస్తే ఇందులో గ్లామర్, రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి దీని ఫలితం ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందా? లేదా? అనేది చూడాలి.

(ఇదీ చదవండి: సిల్క్‌ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)