Breaking News

'బుక్‌మైషో' వాడికి డబ్బులిచ్చి ఇలాంటి పని చేపిస్తున్నాం: నాగవంశీ

Published on Mon, 07/21/2025 - 08:24

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్‌'.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జులై 31న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో 'బుక్‌మైషో'లో కనిపించే రేటింగ్స్‌, లైక్స్‌తో పాటు రివ్యూలు అన్నీ ఫేక్‌ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా డబ్బులిచ్చే తామే చేపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

కొత్తగా విడుదలయ్యే సినిమాకు ఒక నిర్మాత ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో నాగవంశీ ఓపెన్‌గా చెప్పారు.'మీడియాతో సరైనా సత్సంబంధాలు లేకుంటే ఒక సినిమా కిల్‌ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది. గత 15ఏళ్లుగా మేమే దానిని అలా క్రియేట్‌ చేసుకున్నామనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్‌ చేసే వారిలో కొందరు పీఆర్‌ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్‌తో పాటు  డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు డబ్బులు ఖర్చు చేయకుంటే నష్టపోతామని మమ్మల్ని ఏకంగా పీఆర్‌ టీమ్‌ వారు బెదిరిస్తున్నారు. మూవీ విడుదల తర్వాత రేటింగ్‌, లైకులు, మంచి రివ్యూల కోసం ఏకంగా రూ. 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి భయంతో ఉన్న మాకు రూ. 30 లక్షలే కదా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాం.

తాజాగా కింగ్‌డమ్‌ ప్రోమో విడుదలైంది. ప్రేక్షకుల నచ్చింది. ప్రైమ్‌ మీడియాతో పాటు అందరూ బాగా రాశారు. అయితే, ఆ ప్రోమె కంటెంట్‌ నిజంగానే బాగుందని రాశారా..? లేదా పీఆర్‌ టీమ్‌ వారు టాలెంట్‌ చూపించి రాపించారా..? అనేది ఎవరికీ తెలియదు. కానీ, పీఆర్‌ టీమ్‌ మాత్రం తమ వల్లే వారందరూ మంచిగా రాశారని దర్శకుడు, ప్రోడ్యూసర్స్‌ దగ్గరికి వచ్చి గొప్పలు చెప్పుకుంటారు. అలా గొప్పగా మనమే రాపించామండి.. మనం చెప్పకపోతే వారు అసలు అలా రాయరని చెబుతారు. ఇలాంటి పరిస్థితి ప్రితి నిర్మాతకు ఎదురౌతుంది.  'బుక్‌మైషో'లో మీకు కనిపించే రేటింగ్స్‌, లైక్స్‌ కూడా మేము డబ్బులు ఇచ్చే చేపిస్తున్నాం. బుక్‌మైషోలో ఒక సినిమాకు ఎక్కువ లైకులు  ఉంటే మరో సినిమా నిర్మాత ఇలా డబ్బులు ఇచ్చి చేపించడమే.. ఓపెన్‌గా చెబుతున్నాను ఇదే నిజం. ఇలాంటి తప్పుడు ప్రమోషన్‌ చేయకూడదని గిల్డ్‌లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. బుక్‌మైషో వాడికి సినిమా టికెట్‌ ద్వారా వచ్చే కమీషన్‌తో పాటు ఇలా అదనంగా డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక నుంచి  ఇలాంటి పని  ఎవరూ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం.' అని ఆయన అన్నారు.

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)