Breaking News

అల్లు అర్జున్‌ తర్వాతి సినిమాపై నిర్మాత కీలక వ్యాఖ్యలు

Published on Tue, 12/31/2024 - 08:53

పుష్ప2 విజయంతో అంతర్జాతీయస్థాయిలో అల్లు అర్జున్‌ (Allu Arjun) అభిమానులను సొంతం చేసుకున్నారు.  ఈ క్రమంలో బాక్సాఫీస్‌ వద్ద ఆయన మార్కెట్‌ కూడా మరింత పెరిగింది. అయితే, అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్‌ ఎలా ఉండబోతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌ వివరాలు తాజాగా నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.

డాకు మహారాజ్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో నిర్మాత నాగవంశీ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ సినిమా గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. 2025లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బన్నీ పాత్రకు సంబంధించిన గెటప్‌ ఎలా ఉండాలో వారిద్దరూ కూర్చుని ఫైనల్‌ చేయనున్నారన్నారు.

'పుష్ప2తో అల్లు అర్జున్‌ ఇమేజ్‌ మారిపోయింది. అందుకు సరిపోయేలా ఈ ప్రాజెక్ట్‌ భారీ రేంజ్‌లోనే ఉంటుంది. బన్నీ, త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన గత చిత్రాలను మించే కథతో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం ప్రత్యేకంగా ఓస్టూడియోను నిర్మిస్తున్నాం. అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చే ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ పార్ట్‌ చాలా ఉంటుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు ఇది పాన్ ఇండియా మొదటి సినిమా. అందుకే  త్రివిక్రమ్‌ కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ను రెడీ చేశారు.' అని ఆయన అన్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. జనవరిలో స్పెషల్‌ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.  ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని. ఆయన కూడా టచ్‌ చేయని జానర్‌లో ఈ సినిమా ఉంటుందని గతంలోనే నాగవంశీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు కూడా ఆయన అన్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)