Breaking News

లాభాలు తెచ్చే స్తతా లేదు కానీ కోట్లు కావాలి: హీరోలపై షాకింగ్‌ కామెంట్స్‌

Published on Thu, 01/05/2023 - 18:48

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ హీరోల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి లాభాలు తెచ్చే సత్తా ఉండదు కానీ కోట్లకు కోట్లు పారితోషికం అడుగుతారని ఎద్దేవా చేశారు. అలాగే కొన్ని సినిమాల వల్ల తాను పెద్ద మొత్తంలో నష్టపోయానని వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. 'ఇద్దరు వ్యక్తులతో ఒక స్టార్టప్‌లాగా ధర్మ ప్రొడక్షన్స్‌ ప్రారంభించాను. యశ్‌ చోప్రా చెప్పినట్లు సినిమా ఎప్పుడూ ఫెయిల్‌ కాదు, దానికోసం మనం పెట్టే బడ్జెటే దాన్ని నిర్ణయిస్తుంది. స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ విషయంలో అదే రుజువైంది. ఆ సినిమాతో అలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, సిద్దార్థ్‌ మల్హోత్రాలను లాంచ్‌ చేశాను. ఆ సినిమా పేరుకు హిట్టయింది కానీ నాకు డబ్బులు రావడం కాదు కదా పెట్టినవి కూడా పోయాయి.

సినిమా అంటే నాకు ఒక ఎమోషన్‌. హిందీ సినిమా కోసం నా మనసు ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. కానీ ఒక బిజినెస్‌మెన్‌గా మాట్లాడాల్సి వస్తే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే సినిమాలో ఎక్కువ మొత్తం పారితోషికం రూపంలో స్టార్స్‌కే వెళ్లిపోతుంది. ఇలా అంటున్నందుకు నన్ను హత్య చేస్తారేమో, కానీ ఇదే నిజం. సినిమా ఫస్ట్‌ డేకు రూ.5 కోట్లు కూడా రాబట్టలేరు కానీ రూ.20 కోట్లు అడుగుతారు. ఇదసలు న్యాయమేనా?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు కరణ్‌. ఇది చూసిన నెటిజన్లు 'కరణ్‌ కరెక్ట్‌గా చెప్పాడు', 'తెలుగు సినిమాల విషయంలో కరణ్‌ నిజాయితీగా మాట్లాడతాడు' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌ అద్దెకు, ఎన్ని లక్షలంటే?
దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వీజే సన్నీ

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)