Breaking News

జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్‌.. దిల్‌ రాజు ఆసక్తికర కామెంట్స్!

Published on Mon, 01/29/2024 - 17:07

సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు పోటీపడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా  ప్రేక్షకులను పలకరించాయి. అయితే తీవ్రమైన పోటీ ఉండడంతో రవితేజ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు. ఇక సంక్రాంతి సందడి ముగియడంతో అందరి దృష‍్టి సమ్మర్‌ సీజన్‌ సినిమాపైనే ఉంది. మరికొద్ది రోజుల్లో రానున్న సమ్మర్‌లో అలరించేందుకు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో థియేటర్ల సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా రవితేజ ఈగల్ మూవీ మేకర్స్‌ను ఆయన ప్రశంసించారు. ఫిబ్రవరి 9న రిలీజవుతోన్న ఈ చిత్రానికి వీలైనన్నీ ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా రిలీజ్‌పై దిల్‌ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమ్మర్‌లో రిలీజ్‌ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్‌ మూవీ పోస్ట్ పోన్‌ అయితే తాము పోటీలో ఉంటామని తెలిపారు. 

ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. 'సంక్రాంతి సినిమాలకు కచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే సంక్రాంతికి నేను ప్రెసిడెంట్‌గా ఉండను. మరో ఆరు నెలల్లో నా టర్మ్ అయిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నా సినిమా తప్పకుండా ఉంటుంది. ఈ ఏడాది సమ్మర్‌లో దేవర సినిమా ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడితే మేము వస్తామని అన్‌ అఫీషియల్‌గా చెప్పాం. దేవర పోస్ట్‌ పోన్ అయితే మా సినిమా ఫ్యామిలీ స్టార్‌ వస్తుంది. ఇప్పటికే ఒకసారి చెప్పాం కదా ' అని క్లారిటీ ఇచ్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)