Breaking News

పెద్ద సినిమా ఉంటేనే చిన్న సినిమాకి చాన్స్‌!: నిర్మాత ఏయం రత్నం

Published on Sun, 07/20/2025 - 00:07

‘‘ఓ పెద్ద సినిమా రిలీజ్‌ అప్పుడు వీకెండ్‌లో టికెట్‌ ధరలు ఎక్కువ ఉండొచ్చన్నది నా ఉద్దేశం. విదేశాల్లో ఇలానే ఉంటుంది. కానీ మనోళ్లు ఫిక్స్‌ చేస్తే... వారమంతా ఒకటే రేట్‌ ఉంటుంది. వీక్‌ డేస్‌లో మామూలు ధరలు ఉంచి, వీకెండ్‌లో ధరలు పెంచుకునే సౌకర్యం ఉండాలి. అప్పుడు సినిమా టికెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. ‘భారతీయుడు’ సినిమా సమయంలో కలెక్టర్స్‌ను రిక్వెస్ట్‌ చేసి, హైదరాబాద్, వైజాగ్‌లో టికెట్‌ ధరలు పెంచాను.

ఇది తెలిసి రామానాయుడుగారు షాక్‌ అయ్యారు. రత్నం భలే చేశాడన్నారు’’ అని నిర్మాత ఏయం రత్నం అన్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్‌ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్‌ రావు నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్‌ వర్సెస్‌ స్వార్డ్‌’ ఈ నెల 24న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఏయం రత్నం చెప్పిన విశేషాలు.
నా గత చిత్రాలు ‘కర్తవ్యం, భారతీయుడు’ వంటివాటి తరహాలోనే ‘హరిహర వీరమల్లు’లో కూడా వినోదంతోపాటు సందేశం ఉంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కల్పిత కథే ఈ చిత్రం. పవన్‌ కల్యాణ్‌గారితో ‘ఖుషి, బంగారం’ చిత్రాల తర్వాత నేను చేసిన మూడో సినిమా ఇది.

సినిమా అనేది అవసరం కాదు. ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉంటే థియేటర్స్‌కు వస్తారు. లేక పోతే లేదు. కొందరు ఓటీటీలో చూద్దాంలే అని రావడం లేదు. నా సినిమా బాగుంది... కనీసం పెట్టిన డబ్బులైనా తిరిగి రావాలని, టికెట్‌ ధరలను పెంచమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక సినిమా అయితే ఇస్తామన్నారు. మాది చారిత్రక సినిమాయే అని చె΄్పాం. ఆడియన్స్‌ మామూలు సినిమా తీస్తే థియేటర్స్‌కు రావడం లేదు. 

క్వాలిటీ సినిమా అందించాలంటే నిర్మాణ వ్యయం పెరిగి పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా టికెట్‌నుపావలాకు, అర్ధణాకు అమ్మితే ఎలా వర్కౌట్‌ అవుతుంది. ఈ పరిస్థితుల్లో టికెట్‌ ధరలు తక్కు వగా ఉంటే సినిమా థియేటర్స్‌ మూసివేయాల్సి వస్తుంది. మన నేటివిటీ ఉన్న ఒకట్రెండు సినిమాలు ఆడొచ్చు. కానీ ఈ సినిమాలే ఉంటే థియేటర్స్‌ అనేవి ఉండవు. ఓపెనింగ్‌ తెప్పించే పెద్ద సినిమాల వల్లే థియేటర్స్‌ ఉంటాయి. అవి ఉంటేనే కదా... చిన్న సినిమాలకు చాన్స్‌ ఉంటుంది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు