Priyasha Bhardwaj: నేను హీరోయిన్‌ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..

Published on Sun, 05/12/2024 - 12:25

ముంబైని వరల్డ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ అంటారు. ప్రియాషా భరద్వాజ్‌ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్‌ అయింది.. వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గానూ తన టాలెంట్‌ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్‌ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.

  • ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్‌ ఫీల్డ్‌లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్‌.

  • అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్‌లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్‌ థియేటర్‌ గ్రూప్స్‌ బేర్‌ఫూట్‌ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్‌ థియేటర్‌ గ్రూప్స్‌ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.

  • థియేటర్‌ చేస్తున్నప్పుడే మోడలింగ్‌ అవకాశాలు వచ్చాయి. ప్రింట్‌ యాడ్స్‌తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్‌ డే బిస్కట్స్‌ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది.

  • మోడలింగ్‌ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్‌ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్‌ ఇచ్చింది. అందరూ ‘ప్చ్‌..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్‌లో కొనసాగింది.

  • ఆమె టాలెంట్‌ విత్‌ యాటిట్యూడ్‌ అనామకంగా ఏమీలేదు. స్కూప్‌హూప్స్, ఫిల్మ్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ వంటి యూట్యూబ్‌ చానెల్స్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చాన్స్‌ తెచ్చుకుంది.

  • అలా ఆమె ఫస్ట్‌ టైమ్‌ కనిపించిన వెబ్‌ సిరీస్‌ ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్‌ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్స్‌ను ఇంప్రెస్‌ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్‌ ఫ్లెమింగో వంటి సిరీస్‌లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్‌లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్‌ త్రిపాఠీ, డింపుల్‌ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది.

"నేను హీరోయిన్‌ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్‌లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్‌ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్‌ని క్యాచ్‌ చేశాను. పైగా సిరీస్‌లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్‌తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్‌ ద లిమిట్‌. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్‌ ప్రివిలేజ్డ్‌ అమ్మాయిలకు థియేటర్‌లో ట్రైనింగ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్‌ గ్రూప్‌  పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)