Breaking News

19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్‌

Published on Fri, 01/31/2025 - 12:21

సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఇండస్ట్రీలోకి వస్తారు. అవకాశాల కోసం ఎదురు చూసి..చాన్స్‌ వచ్చినప్పుడే తమను తాము నిరూపించుకుంటారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించి వచ్చినవాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు అయితే చాలా ‘ఇబ్బందులను’ ఎదుర్కొవాల్సి వస్తోంది. అవకాశాల పేరుతో మోసం చేసేవాళ్లు కొంతమంది అయితే.. అవకాశం ఇచ్చి అవమానించే వారు మరికొంతమంది. ఇలాంటి వాళ్లను తట్టుకొనే ఈ స్థాయికి వచ్చానని అంటోంది గ్లోబల్‌ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). తన కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, 19 ఏళ్ల వయసులోనే ఓ డైరెక్టర్‌ తన గురించి చెడుగా ప్రవర్తించాడని, ఆయన అన్న మాటలకు డిప్రెషన్‌లోకి వెళ్లాని చెప్పింది. 

నీచంగా మాట్లాడాడు
తాజాగా జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో ప్రియాంక పాల్గొని కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. ‘19 ఏళ్ల వయసులో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పటికే చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓ సినిమా కోసం సెట్‌లోకి వెళ్లాను. దర్శకుడిని కలిసి ఇప్పుడు నాకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి మా కాస్ట్యూమ్‌ డిజైనర్‌కి చెప్పండి’ అని అడిగాను. అతను నా ముందే  స్టైలిస్ట్‌ ఫోన్‌ చేసి నీచంగా మాట్లాడాడు.

అలాంటి దుస్తులే వేసుకోవాలి
ఆ డైరెక్టర్‌ నా స్టైలిస్ట్‌కి ఫోన్‌ చేసి.. ‘హీరోయిన్‌ లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. కాబట్టి ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.  తన లోదుస్తులు కనిపించాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ పదే పదే ఆ పదాన్నే ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పడు నీచంగా అనిపించిది. చాలా బాధ కలిగింది.  డిప్రెషన్‌లోకి వెళ్లాను.  మా అమ్మ దగ్గరకు వెళ్లి  అతడు నన్ను అంత చిన్నచూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేను అని చెప్పేశాను. ఆ మరుసటి రోజే వెళ్లి నేను ఈ సినిమా చేయలేనని చెప్పాను. ఇప్పటికీ ఆ దర్శకుడితో నేను కలిసి పని చేయలేదు. నన్ను ఎలా చూపించుకోవాలని అనేది నా ఛాయిస్. దృష్టికోణం అనేది నిజం. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

మహేశ్‌కి జోడీగా
బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన ప్రియాంక..పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి తన మకాంని మార్చింది. 'క్వాంటికో' టెలివిజన్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బేవాచ్‌, ఏ కిడ్‌ లైక్‌ జాక్,లవ్‌ అగైన్‌,టైగర్‌, వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌, ది వైట్‌ టైగర్‌ తదితర చిత్రాలలో నటించి అక్కడ అగ్ర హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈ గ్లోబల్‌ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)