11 ఏళ్ల వయసు, అర్థరాత్రి క్యాబ్‌లో వెళ్తుంటే.. : ప్రియాంక చోప్రా

Published on Sat, 02/21/2026 - 13:27

తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాతో షేర్‌ చేసుకుంది ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్‌’. త్వరలోనే ఈ చిత్రం నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ.. తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపించింది.

‘మేము ఒకరోజు ఢిల్లీలోని ఓ హోటల్‌ నుంచి క్యాబ్‌లో బయటకు వెళ్తున్నాం. అర్థరాత్రి 11 గంటలు అవుతుంది. క్యాబ్‌లో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. కొంచెం దూరం వెళ్లిన తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌ సడెన్‌గా రూట్‌ మార్చాడు. వేరే దారిలోకి కారుని తీసుకెళ్లాడు. ఆ దారిలో ఎవరూ లేకపోవడంతో ‘ఈ వైపు ఎందుకు వెళ్తున్నావు’ అని అమ్మ అడిగితే..‘షార్ట్‌కట్‌’ అని డ్రైవర్‌ సమాధానం ఇచ్చాడు. అమ్మకు అనుమానం వచ్చింది. 

ప్రమాదాన్ని ముందే పసిగట్టి, వెంటనే వెనుక సీట్లో కూర్చోనే క్యాబ్‌ డ్రైవర్‌ గొంతు గట్టిగా పట్టుకుంది. మెయిన్‌ రోడ్డుపైకి వెళ్లాలని హెచ్చరించింది. అంతటి ఆగకుండా డ్రైవర్‌ని చెప్పదెబ్బ కొట్టిమరీ.. మెయిన్‌ రోడ్డు వైపుకి వచ్చేలా చేసింది. ఆ సమయంలో అమ్మ గట్టిగా అరిచింది కూడా. ‘టీనేజ్‌ వయసున్న నా కూతురితో  ఉన్నాను. మర్యాదగా మెయిన్‌ రోడ్డువైపు వెళ్లండి’ అని సీరియస్‌ అయింది. అమ్మను అలా చూసి షాకయ్యాను. దాదాపు నాలుగు నెలల వరకు ఆమెను వాదించేందుకు సాహసం చేయలేదు. 

బహుషా ఒంటరిగా ఉంటే అమ్మ అంత గట్టిగా అరిచేది కాకపోవచ్చు. భయపడేది కూడా. కానీ పక్కన నేను ఉండడంతో..తల్లిలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో అలాంటి యాంగిల్‌, అంత ధైర్యాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. 

‘ది బ్లఫ్’ విషయానికొస్తే.. ఫ్రాంక్‌ ఈ ఫ్లవర్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు.  ప్రస్తుతం ప్రియాంక.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. 

Videos

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

అన్ని దేశాలకు 10% గ్లోబల్ టారిఫ్

హిందువుల ద్రోహి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి

ఇంకోసారి లడ్డు గురించి మాట్లాడాలంటే... బాబుపై కన్నెర్రజేసిన జడ శ్రవణ్

ప్రభాస్ కల్కి 2.. దీపిక ప్లేస్ లో సాయిపల్లవి

ప్రేమలో ప్రభాస్ వైరల్ అవుతున్న వీడియో

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

బెంగళూరు AMB మల్టీఫ్లెక్స్‌లో సందడి చేసిన మహేష్‌ బాబు (ఫోటోలు)