Breaking News

అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంకా చోప్రా

Published on Tue, 04/25/2023 - 04:21

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ వెళ్లి, అక్కడ జోరుగా ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. ఆమె నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిన నేను హాలీవుడ్‌లో కొత్త నటిలా కెరీర్‌ ఆరంభించినప్పుడు ఆడిషన్స్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఆడిషన్స్‌ ఇవ్వడం తప్పని అనడంలేదు. ఎందుకంటే ఆడిషన్స్‌ అనేవి మన ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. ఇండస్ట్రీలో ఉన్న కనెక్షన్స్‌తో కాదు. ఆడిషన్స్‌లో గెలిచి, చాన్స్‌ తెచ్చుకోవడం అప్పట్లో న్యూ కమర్‌గా హాలీవుడ్‌లో నాకో మంచి అనుభూతి.

అయితే ఇప్పుడు ‘సిటాడెల్‌’కి ఆడిషన్స్‌ ఇవ్వ కుండానే సెలక్ట్‌ అయ్యాను. అంతగా నా ప్రతిభని నిరూపించుకున్నాను. ఇప్పుడు పోస్టర్స్‌లో నాకూ సమభాగం దక్కుతోంది. అలాగే, మేల్‌ స్టార్స్‌కి ఈక్వల్‌గా పారితోషికం తీసుకుంటున్నా. హాలీవుడ్‌కి వెళ్లిన పదేళ్లకు నేను సాధించుకున్న ఘనత ఇది’’ అన్నారు. ఇంకా భారతీయ తారల గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియన్‌ స్టార్స్‌ ఉంటున్నారు. తెర పైనే కాదు.. తెరవెనక కూడా ప్రతిభను చాటుకుంటున్నారు. వాళ్లందరూ హాలీవుడ్‌కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనవాళ్లకి అంత ప్రతిభ ఉంది’’ అన్నారు.  
 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)