Breaking News

వారణాసిలో తెలుగు డబ్బింగ్.. ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?

Published on Wed, 11/19/2025 - 20:02

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తొలిసారి వస్తోన్న భారీ బడ్జెట్‌ అడ్వెంచరస్‌ మూవీ వారణాసి. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ను దర్శకధీరుడు రివీల్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఈవెంట్‌ ప్లాన్ చేసి మరి టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రాండ్ గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌కు మహేశ్ బాబు ఫ్యాన్స్‌ పెద్దఎత్తున హాజరయ్యారు.

అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రతిష్టాత్మక గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లోనూ మెరిసింది బాలీవుడ్ బ్యూటీ. తన డ్రెస్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే అంతకుముందే ప్రియాంక ట్విటర్ వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీరు తెలుగులో మాట్లాడతారా? ఈ సినిమాలో మీ పాత్రకు తెలుగు డబ్బింగ్‌ చెప్తారా? అంటూ ప్రియాంకను కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు.

దీనిపై ప్రియాంక చోప్రా తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. 'వారణాసి' కోసం తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించింది. అవును నేనే డబ్బింగ్ చెప్తా.. తెలుగు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది. తెలుగు నా ప్రాథమిక భాష కాదని.. అందుకే రాజమౌళి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారని వెల్లడించింది. అంతకుముందు వారణాసి ఈవెంట్‌లో ఏదైనా తప్పులు దొర్లితే నన్ను క్షమించాలని అభిమానులను కోరింది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో తగలబెట్టేద్దామా, మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అంటూ డైలాగ్స్‌తో ప్రియాంక చోప్రా అభిమానులను అలరించింది.

p

కాగా.. వారణాసి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.   ఈ మూవీలో హేశ్‌బాబు రుద్రగా కనిపించనుండగా.. మందాకిని పాత్రలో ప్రియాంక ‍మెప్పించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను 2027 వేసవిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌