Breaking News

ఇండియన్‌ సినిమా చేయడం హ్యాపీ

Published on Sat, 07/05/2025 - 00:23

‘‘ఇండియాని చాలా మిస్‌ అయిపోతున్నాను. హిందీ సినిమాలను కూడా మిస్సవుతున్నాను. ఇప్పుడు ఓ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇండియన్‌ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇండియాలో 2002లో నా తొలి సినిమా (తమిళ చిత్రం ‘తమిళన్‌’)తో  కెరీర్‌ మొదలుపెట్టి, ఎన్నో రకాల సినిమాలు చేశాను.

ఎందరో ప్రతిభావంతులతో సినిమాలు చేశాను. అందుకే ఈ సంవత్సరం ఇండియన్‌ సినిమా (మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ఉద్దేశించి) చేయడం చాలా ఆసక్తిగా ఉంది. భారతీయ ప్రేక్షకులు నా పై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది. నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.

హాలీవుడ్‌ సింగర్‌–యాక్టర్‌–మ్యూజిక్‌ డైరెక్టర్‌ నిక్‌ జోనస్‌ని 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమాలో నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)