Breaking News

నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్

Published on Mon, 06/26/2023 - 18:02

సీనియర్ నటి ప్రియమణి పేరు చెప్పగానే యమదొంగ సినిమానే గుర్తుకు వస్తుంది. అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లైన కొత్తలో, గోలీమార్‌ చిత్రాల్లోనూ తన నటనతో మెప్పించింది.  టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ఇటీవలే నాగచైత్యన కస్టడీ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది ప్రియమణి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తాను చాలా సందర్భాల్లో ట్రోల్స్‌కు గురైనట్లు వెల్లడించింది.  ముఖ్యంగా తన పెళ్లి సమయంలో నెటిజన్స్ తీవ్రంగా విమర్శలు చేశారని తెలిపింది.  

(ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)

ప్రియమణి మాట్లాడుతూ.' నేను ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్‌, కలర్ గురించి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్‌మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నువ్వేందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు?' అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.' అని అన్నారు. 

ట్రోల్స్‌పై స్పందిస్తూ.. నా జీవితాన్ని ఎవరితో కొనసాగించాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ప్రియమణి అ‍న్నారు. ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోనని.. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ట్రోల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చి.. వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని పేర్కొన్నారు. కాగా.. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. నారప్ప, భామా కలాపం, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ నటిస్తోన్న జవాన్‌లో కనిపించనున్నారు.  

(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!)

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)