Breaking News

తెలుగులో స్టార్‌ హీరోల పక్కన ప్రియమణికి నో ఛాన్స్‌.. ఎందుకంటే?

Published on Wed, 04/10/2024 - 13:24

అందాల ప్రియమణి.. తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. కానీ పెద్ద హీరోలతో ఒకటీరెండు చిత్రాలు మినహా ఎక్కువగా నటించలేదు. మీడియం రేంజ్‌ హీరోలతోనే ఎక్కువ మూవీస్‌ చేసిన ఈమె తెలుగు, తమిళ భాషల్లో బడా స్టార్‌ హీరోలతో జతకట్టనేలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో స్టార్‌ హీరోల సరసన నటించకుండా ఉండిపోవడానికి కారణమేంటన్న ప్రశ్న ప్రియమణికి తరచూ ఎదురవుతుంది. మైదాన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా అక్కడా ఇదే ప్రశ్న ఎదురైంది.

నా డామినేషన్‌ ఎక్కువ!
దీనికి ప్రియమణి స్పందిస్తూ.. 'టాప్‌ లిస్టులో ఉండే హీరోలకు జోడీగా నన్నెందుకు తీసుకోరనేది నాకూ అర్థం కాదు. ఇప్పటికీ దాని సమాధానం నా దగ్గర లేదు. ఈ ప్రశ్న దర్శకనిర్మాతలను అడిగితే బాగుంటుంది. అయినా ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. చాలామంది దగ్గర నేను విన్నదేంటంటే.. నన్ను సినిమాలో తీసుకుంటే నా పక్కన ఉన్నవాళ్లు కనబడకుండా డామినేట్‌ చేస్తానట! వారి పాత్రలను తినేస్తానట! అందుకనే స్టార్‌ హీరోకు జోడీగా లేదా వారి సినిమాల్లో నన్ను తీసుకోవడానికి ఆసక్తి చూపించరని చెప్తుంటారు.

సగం తెలిసినవాళ్లే, అయినా..
ఏదో అలా అంటారు కానీ, ఇది నిజం కాదులెండి.. సరైన కారణమేంటన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు. అయినా ఏం పర్లేదు.. నేను చేస్తున్న పాత్రలతో సంతృప్తిగానే ఉన్నాను. అయితే నెంబర్‌ 1 హీరోలతో నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాళ్లతో పనిచేయకపోవడం వల్ల అవన్నీ మిస్‌ అయిపోతున్నానపిస్తుంది. దాదాపు సగం మంది స్టార్‌ హీరోలు నాకు పరిచయస్థులే..కనిపిస్తే హాయ్‌, బాయ్‌ అనైనా పలకరించుకుంటాం. వారి సినిమాల్లో నన్ను ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదని కొన్నిసార్లు బాధగానూ అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చింది.

చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)