Breaking News

ఆయన నుంచి ఫోన్‌ వస్తే చాలు.. చేయి కోసుకోవడానికైనా రెడీ: హీరోయిన్‌

Published on Wed, 01/29/2025 - 09:24

హీరోహీరోయిన్లుకు కొన్ని డ్రీమ్‌ రోల్స్‌ ఉంటాయి. పలానా పాత్ర చేయాలని.. అలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటారు. అంతేకాదు కొంతమంది దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలు.. చిన్న పాత్ర అయినా సరే చేసేందుకు రెడీ అవుతారు. అలా ఓ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అన్ని వదిలేసి ఆయన మూవీ కోసం ఎదురు చూస్తాను అంటోంది సీనియర్‌ నటి ప్రియమణి(Priyamani ). అంతేకాదు ఆయన సినిమాలో నటించేందుకు చేసు కూడా కోసుకుంటాను అని చెబుతోంది. ఇంతకీ ఆ గొప్ప దర్శకుడు ఎవరంటే..?

ఫోన్‌ వస్తే చాలు.. 
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే.. అందులో కచ్చితంగా మణిరత్నం(Mani Ratnam) పేరు ఉంటుంది. సౌత్ సినిమా దశాదిశను మార్చేసిన అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన తెరకెక్కించిన  గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే మాస్టర్ క్లాసిక్‌ మూవీస్‌. ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునే హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు మణిరత్నం ఫేవరేట్‌ డైరెక్టర్‌. వారిని తెరపై అందంగా, డిఫరెంట్‌గా చూపించే డైరెక్టర్‌ ఆయన. అందుకే ఆయన సినిమాలో చాన్స్‌ వస్తే ఏ హీరోయిన్‌ అయినా వదులుకోదు. కమిట్‌ అయిన సినిమాలను వదిలేసి మరీ.. మణిరత్నం సినిమాల్లో నటిస్తారు. 

ప్రియమణికి కూడా మణిరత్నం అంటే చాలా ఇష్టం.  తాజగా ఓ ఇంటర్వ్యూలో  మణిరత్నం గురించి మాట్లాడుతూ..  ‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే ’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. గతంలో మణిరత్నం తెరకెక్కించిన రావన్ సినిమాలో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌లో బిజీ బిజీ
ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగిన ప్రియమణి.. పెళ్లి తర్వాత చిత్రపరిశ్రమకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి..సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తోంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌ చేస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెరను ఏలేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు