Breaking News

స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఏకంగా త్రిష ప్లేస్‌లో!

Published on Sat, 06/03/2023 - 07:27

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్‌ నటిస్తోన్న తాజా చిత్రం లియో. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు. త్రిష కథానాయకిగా నటిస్తున్న ఇందులో పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోసిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. సగానికి పైగా షూటింగ్‌ పూర్తిచేసుకున్న లియో చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

(ఇది చదవండి: త్రిషకు వరుస ఛాన్సులు.. ఈసారి ఏకంగా ధనుష్‌తో జోడీ!)

కాగా తర్వాత విజయ్‌ నటించనున్న తన 68వ చిత్రం గురించి ఇప్పటికే ప్రచారం హోరెత్తింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దర్శకుడు మిష్కిన్‌, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇకపోతే ఇందులో నాయకిగా నటించే అవకాశం త్రిష వరించినట్లు ఇప్పటికే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

(ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!)

ఇలాంటి పరిస్థితుల్లో మరో నటి పేరు తెరపైకి వచ్చింది. తనే ప్రియా భవాని శంకర్‌. ఇంతకు ముందు యువ హీరోలతో జతకడుతూ వచ్చిన ఈ భామ ఇటీవల పత్తుతల చిత్రంలో శింబు సరసన, లారెన్స్‌కు జంటగా రుద్రన్‌ చిత్రంలోనూ నటించారు. అలాంటిది తాజాగా దళపతి విజయ్‌తో రొమాన్స్‌ చేసే లక్కీ ఛాన్స్‌ వచ్చినట్లు టాక్‌. అయితే ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా త్రిషతో పాటు ప్రియా భవాని శంకర్‌ నటించనున్నారా? లేక త్రిషను పక్కకు నెట్టి ప్రియా భవాని శంకర్‌ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారా అనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)