Breaking News

భారతీయుడు 2 ఫ్లాప్‌.. నా వల్లే అంటున్నారు: హీరోయిన్‌

Published on Wed, 08/07/2024 - 17:39

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అద్భుతంగా ఉంటే దాని సీక్వెల్‌ దరిదాపుల్లో కూడా లేదని పలువురూ విమర్శించారు. ఈ మూవీ విడుదలైనప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించారంటోంది హీరోయిన్‌ ప్రియ భవానీ శంకర్‌.

ముందే తెలిస్తే..
హీరోయిన్‌ ప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్‌ చిత్రం ఇండియన్‌ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్‌గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్‌ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్‌ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.

వర్కవుట్‌ కాకపోతే..
అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్‌ కాకపోతే చాలా బాధేస్తుంది. ఇండియన్‌ 2 హిట్‌ అవదని తెలిసినా సరే దాన్ని నేను వదులుకోకపోయేదాన్ని. కమల్‌ -శంకర్‌ సర్‌ కాంబినేషన్‌లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ..

ఒక్కరే కారణం కాదు
సినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియ భవానీ శంకర్‌ 'డీమాంటి కాలనీ' సినిమాలో యాక్ట్‌ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు