Breaking News

ఆ విషయంలో ప్రభాస్‌ గ్రేట్‌.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్‌

Published on Thu, 01/30/2025 - 18:08

మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) సలార్‌ సినిమాతో తెలుగులోనూ ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. గతేడాది ద గోట్‌ లైఫ్‌ (ఆడుజీవితం), గురువాయూర్‌ అంబలనడయిల్‌ చిత్రాలతో రెండు హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. SSMB29 (మహేశ్‌బాబు- రాజమౌళి కాంబో) సినిమాలోనూ పృథ్వీరాజ్‌ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మహేశ్‌-రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్‌?
తాజాగా దీనిపై పృథ్వీరాజ్‌ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నాకంటే ఎక్కువ మీ అందరికే బాగా తెలిసినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు ఇంకా ఏదీ ఫైనలవలేదు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అంతా ఫిక్సయ్యాక అప్పుడు చూద్దాం.. అన్నాడు. సలార్‌ 2 (Salaar 2 Movie) గురించి మాట్లాడుతూ.. సలార్‌ సీక్వెల్‌ ఉందని మాత్రమే నేను చెప్పగలను. ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel).. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. అది అయిపోయిన వెంటనే సలార్‌ 2 మొదలుపెడ్తాం.

ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి
ప్రభాస్‌ (Prabhas) గురించి చెప్పాలంటే తన స్టార్‌డమ్‌ తనకు తెలియదు. ఆయన సోషల్‌ మీడియాలో లేడనుకుంటాను. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని అతడు మాత్రం హ్యాండిల్‌ చేయడు. సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు. పబ్లిక్‌లో ఉండటానికి బదులు ప్రైవేట్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడు. అది నిజంగా గ్రేట్‌. ఇది ప్రభాస్‌ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన అంశం అని చెప్పాడు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు, సింగర్‌ కూడా! లూసిఫర్‌, బ్రో డాడీ చిత్రాలకు ఈయనే దర్శకత్వం వహించాడు. మలయాళంలో పలు పాటలు ఆలపించాడు.

చదవండి: ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్‌ రోషన్‌ తండ్రి

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)