Breaking News

'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్

Published on Thu, 06/18/2026 - 19:56

'సలార్' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి 'వారణాసి'లో విలన్‌గా చేస్తున్నాడు. ఇతడి పాత్రకు సంబంధించిన షూటింగ్ చాన్నాళ్ల క్రితమే పూర్తయింది. అదొచ్చేలోపు పృథ్వీరాజ్ హీరోగా చేసిన ఓ మూవీ విడుదలకు సిద్ధమైంది. 'ఐ, నోబడీ' పేరుతో దీన్ని తీయగా.. వచ్చే నెల 9న తెలుగు, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు.

(ఇదీ చదవండి: హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్)

ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ట్రైలర్ బట్టి చూస్తే ఇది డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్. ప్రభుత్వ ఉద్యోగం చేసే రాజీవ్(పృథ్వీరాజ్) ఓ డబ్బు వివాదంలో ఇరుక్కుంటాడు. దీంతో విలన్, పోలీసులు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? దీనికోసం అంతమంది ఎందుకు వెతుకున్నారు? ఇంతకీ రాజీవ్ ఎవరు? అనేది స్టోరీలా అనిపిస్తుంది. పార్వతి తిరువత్తు హీరోయిన్. నిషాం బషీర్ డైరెక్టర్. పృథ్వీరాజ్ భార్య సుప్రియ ఓ నిర్మాత. ట్రైలర్ చివరలో 'మీ నాన్నతో ఫైట్ చేసిన వాళ్లెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు' అనే డైలాగ్ మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.

(ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్)

Videos

తెలంగాణలో SIR షురూ

మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. కాన్వాయ్ అపి మరీ...

సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు

CI నాగరాజు పాత్రదారుడు మాత్రమే... సూత్రదారులు ఎవరంటే...? పొన్నవోలు కీలక వ్యాఖ్యలు

ముద్రగడ ఆరోగ్యంపై పిచ్చి వార్తలు.. తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ వార్నింగ్

సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!

నిజాన్ని దాచలేరు.. తప్పు ఒప్పుకున్న CI నాగరాజు

దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం

లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?

Pulivendula : ఇసుక వేస్తే రాలనంత జనం

Photos

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)

+5

సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు

+5

గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

+5

కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)

+5

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)

+5

టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)