Breaking News

మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్‌లో సలార్ హీరో.. క్లారిటీ ఇదే!

Published on Wed, 01/29/2025 - 18:14

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అడ్వెంచరస్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్‌ లోకేషన్స్ కోసం విదేశాలకు సైతం వెళ్లివచ్చారు మన డైరెక్టర్.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేయనున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. సలార్‌తో తెలుగులోనూ సూపర్ క్రేజ్‌ తెచ్చుకున్న సుకుమారన్‌ మహేశ్‌బాబు చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ప్రస్తుతం మలయాళంలో ఎంపురాన్‌ మూవీలో నటిస్తోన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.

నాకంటే మీకే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని మీడియాతో అన్నారు. మహేశ్ బాబు చిత్రంలో నటించే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను.. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఓకే అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. సలార్‌తో మరింత్ స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్‌.. సలార్‌-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సలార్‌ సమయంలో ప్రభాస్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు.
 
అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్‌ఎంబీ29 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాకం చోప్రాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆమె హైదరాబాద్‌లోని చిలుకురు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు.

 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)