Breaking News

Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!

Published on Sat, 12/16/2023 - 20:45

బిగ్‌బాస్ షోలో 7వ సీజన్ విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్ నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఓ కంటెస్టెంట్.. సూట్‌కేసులోని మంచి మొత్తానికి టెంప్ట్ అయినట్లు టాక్. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? ఎంత డబ్బు దక్కించుకున్నాడు?

సూట్‌కేసు సంప్రదాయం
బిగ్‌బాస్ గత కొన్ని సీజన్లని తీసుకుంటే ఈ సూట్‌కేసు సంప్రదాయం ఏంటనేది తెలుస్తోంది. 4వ సీజన్‌లో ఫినాలే రేసులో ఉన్న సొహైల్.. రూ.25 లక్షలు తీసుకుని బయటకొచ్చేశాడు. ఓటీటీ సీజన్‌లో అరియానా.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయింది. గత సీజన్‌లోనూ ఏకంగా రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్.. తనకు తానుగా బయటకొచ్చేశాడు. అయితే ఈసారి ఫినాలే జరగడానికి ముందు సూట్‌కేసు ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎవరూ దీన్ని ఉపయోగించలేదు.

(ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్‌బాస్‌ ట్రోఫీ.. రన్నరప్‌ అతనే..‘సాక్షి’పోల్‌ రిజల్ట్‌)

యావర్ తెలివైన నిర్ణయం
SPY బ్యాచ్‌లో ఉండటం ప్లస్ గేమ్స్‌లోనూ మంచిగా ఫెర్ఫార్మ్ చేయడం వల్ల.. తెలుగు పెద్దగా రాకపోయినా గానీ యావర్.. ఫినాలే వరకు వచ్చేశాడు. రూ.10 లక్షల మొత్తం ఆఫర్ చేసినప్పుడు లైట్ తీసుకున్నాడు. కానీ ప్రియాంక, అర్జున్.. ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేసరికి మనోడికి బుర్ర పనిచేసినట్లుంది. మిగతా ముగ్గురి(ప్రశాంత్, అమర్, శివాజీ)ని దాటి కప్ కొట్టడం కష్టం. కాబట్టి నాగ్ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

యావర్‌కి అవసరమే
సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన యావర్.. తనకు, తన ఫ్యామిలీకి డబ్బు అవసరమని ఇదే బిగ్‌బాస్‌లో చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు రూ.15 లక్షలు తీసుకుని మంచి పనిచేశాడని చెప్పొచ్చు. అయితే డబ్బులు తీసుకునే విషయంలో శివాజీ ఏమైనా హింట్ ఇచ్చాడా? లేదంటే ఇది యావర్ సొంత నిర్ణయమా? అనేది ఆదివారం ఎపిసోడ్‌లో తెలిసిపోతుంది!

(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)