Breaking News

జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం.. ఉత్తమ చిత్రంగా 'సూరారై పోట్రు'

Published on Fri, 09/30/2022 - 20:07

దేశ రాజధాని ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డులు ప్రదానం చేశారు. డిల్లీలోని విఘ్నయన్​ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ హాజరయ్యారు. 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జి.ఆర్‌.గోపినాథ్‌ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక కలిసి హాజరయ‍్యారు తమిళ హీరో సూర్య.

సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్‌ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుుకంది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్‌ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది. 

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్‌ సంగ్‌ వారియర్‌' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్‌ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. 

Videos

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)