Breaking News

కోలీవుడ్‌లో మరో ఛాన్స్‌ అందుకున్న యశోద నటి

Published on Sat, 05/13/2023 - 09:28

ఏ రంగంలోనైనా సక్సెస్‌ చాలా ముఖ్యం. విజయంతోనే పేరు, అవకాశాలు. అలా ఇటీవల డాడా చిత్రంతో విజయాన్ని అందుకున్న నటుడు కవిన్‌ తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు సతీష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి కిస్‌ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా ఇందులో కవిన్‌కు జంటగా కుక్‌ విత్‌ కోమాలి ఫేమ్‌ ప్రీతి ఇస్రాణిని కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈమె ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించింది. ప్రెజర్‌ కుక్కర్‌, యశోద, దొంగలున్నారు జాగ్రత్త సినిమాల్లో నటించింది. ఇటీవల శశికుమార్‌ హీరోగా నటించిన అయోధి చిత్రంలో ప్రీతి ఇస్రాణిని నాయకిగా నటించింది. గత మార్చి నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది ప్రీతి. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు కవిన్‌కు జంటగా కిస్‌ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఇందులో నటి కుష్బూ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

చదవండి: షూటింగ్‌లో వీజే సన్నీకి గాయాలు

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)