Breaking News

సరికొత్త ఫీచర్స్‌తో స్టూడియో నిర్మాణం.. బిజినెస్‌లో స్పీడు పెంచిన హీరోయిన్‌

Published on Tue, 04/09/2024 - 09:25

పాపులర్‌ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్‌ హీరోయిన్‌ ప్రీతా విజయకుమార్ నిరూపిస్తున్నారు.  నటుడు విజయ్‌ కుమార్‌, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత     ప్రియమైనా నీకు, మా అన్నయ్య,    క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాల్లో కనిపించిన ఆమె 2002లో దర్శకుడు హరితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో పాటుగా వ్యాపార రంగంలో రాణిస్తుంది.

కోలీవుడ్‌లో పక్కా మాస్ కమర్షియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న దర్శకుడు హరి. ఈయన గత ఏడాది 'గుడ్‌ లాక్' పేరుతో ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాల కోసం చెన్నైలో స్టూడియోను ఏర్పాటు చేశారు. ఆది ఇప్పుడు ద్విగ్విజయంగా తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగిడింది. ఈ సందర్భంగా ఈ కపుల్స్‌ తన యూనిట్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. గుడ్‌ లక్‌ స్టూడియో మొదటి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

తన స్టూడియోను మరింత ఆధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. 5.1 మిక్సింగ్, డబ్బింగ్ వసతులను సమకూర్చినట్లు తేలిపారు. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నానన్నారు. ఇలా మొత్తం మూడు స్టూడియోలను ఈ కపుల్స్‌ నిర్వహిస్తున్నారు. వాటి బాధ్యతలు ఎక్కువగా ప్రీతా చూసుకుంటారు. కాగా ప్రస్తుతం విశాల్ హీరోగా రత్నం చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి ప్రియభవానీ శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్య క్రమాలు జరుపుకుంటోంది. పక్కా మాస్ మసాలా కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

దర్శకుడు హరి, విశాల్ హీరోగా ఇంతకు ముందు భరణి, పూజై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో తాజా చిత్రం రత్నంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు ప్రేక్షకుల నుంచి స్పందన లభించడం గమనార్హం.

ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్‌ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్‌ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్‌ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)