Breaking News

‘గద్దర్‌ అవార్డ్స్‌’ లో తెలంగాణకు అన్యాయం: ప్రతాని రామకృష్ణ గౌడ్‌

Published on Tue, 06/03/2025 - 10:52

‘‘తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌గారి పేరుతో అవార్డ్స్‌(Gaddar Awards) ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే ఈ అవార్డు కమిటీ జ్యూరీకి మురళీ మోహన్‌ , జయసుధలను చైర్మన్లుగా నియమించడం ఏంటో అర్థం కాలేదు. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ‘దిల్‌’ రాజు తన అధికారాలను దుర్వినియోగం చేశారు. తన వాళ్లకే అవార్డ్స్‌ ఇచ్చుకున్నారు. జ్యూరీ కమిటీలో ఉన్నవాళ్ల సినిమాలకు అవార్డ్స్‌ ఇవ్వకూడదనే నిబంధనలను పాటించలేదు. థియేటర్స్‌ బంద్‌ విషయంలోనూ ‘దిల్‌’ రాజు ప్రమేయం ఉంది’’ అని ‘తెలంగాణ ఫిలిం చాంబర్‌’ చైర్మన్‌  ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. 

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌’లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగింది. జ్యూరీ కమిటీ సభ్యులు అన్ని సినిమాలు చూడలేదు. థియేటర్స్‌లో పర్సంటేజీ విధానం వల్ల గతంలో లాభాలు ఆర్జించిన డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రస్తుత విధానాల వల్ల నష్టాలు వస్తున్నాయి. 

2002 వరకు థియేటర్స్‌లో పర్సంటేజీ విధానం ఉండేది. ఆ తర్వాత నిర్మాత డి. సురేష్‌ బాబులాంటి కొందరు తమ స్వార్థంతో అద్దె విధానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్‌’ రాజు, ఏషియన్‌ సునీల్‌.. లాంటి వాళ్లు సురేష్‌ బాబు బాటలోనే నడిచి థియేటర్స్‌ను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు’’ అన్నారు. ‘‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌’లను ప్రభుత్వం పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, నటుడు కిరణ్, తెలంగాణ డైరెక్టర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ నాయుడు, తెలంగాణ రైటర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ అమృత్‌ గౌడ్‌ కోరారు. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు