Breaking News

ప్రశాంత్ వర్మ మరో సర్‌ప్రైజ్‌.. ఏకంగా బాహుబలి హీరోతో!

Published on Mon, 11/04/2024 - 18:21

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్‌ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్‌తో సీక్వెల్‌ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.

జై హనుమాన్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్‌ థీమ్ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై  హనుమాన్‌ అని క్యాప్షన్‌ ఇస్తూ రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్‌.. రానా కూడా జై హనుమాన్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.

ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్‌కు తగినట్లు పవర్‌ఫుల్‌ రోల్‌ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)