Breaking News

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి చేతుల మీదుగా 'ప్రణయగోదారి' సాంగ్ విడుదల

Published on Sun, 06/23/2024 - 14:25

సరికొత్తగా ఆవిష్కరిస్తున్న కథలకు, నాచురల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్న సినిమాలకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంటోంది. సరిగ్గా ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఓ డిఫరెంట్ కంటెంట్‌తో 'ప్రణయగోదారి' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్, ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ల లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్ గుడ్ సాంగ్ లాంచ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. కలలో కలలో.. అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్ బీట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి.

ఈ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని అన్నారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయని అన్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి