Breaking News

పవన్‌, విజయ్‌ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్‌

Published on Wed, 05/07/2025 - 07:22

తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌, జనసేన నేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ విమర్శలు గుప్పించారు. ఓ తమిళ పత్రికలో ప్రకాష్‌ రాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చైన్నెలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ప్రకాష్‌ రాజ్‌ కలవడం గమనార్హం.  పవన్‌ కల్యాణ్‌, విజయ్‌లకు ఇద్దరికీ  ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని  ప్రకాశ్‌ రాజ్‌ ఆరోపించారు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ అభిమానులు మాత్రమే  పార్టీ కార్యకర్తలుగా మారారని గుర్తుచేశారు. విజయ్‌ కూడా తమిళ్‌లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్‌కు ఎలాంటి గుర్తింపు లేనప్పుడే ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అయితే, పవన్‌ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తే.. విజయ్‌ మాత్రం ఇప్పుడే సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారన్నారు.

విజయ్‌, పవన్‌లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడింది లేదన్నారు. పవన్‌ వచ్చి పది సంవత్సరాలు అయిందని ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు. ఆయనలో ఆవేశం తప్పా ఎలాంటి విజన్‌ లేదు. కాబట్టే రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మార్పు కోసం అంటూ రాజకీయాలలోకి వస్తున్న వారు తమ ఇమేజ్‌ను పక్కనబెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపును సొంతంగా అందుకోవాలన్నారు. విజయ్‌కు ఉన్న ఇమేజ్‌ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చన్నారు. గెలుపు వచ్చిన తర్వాత ప్రజల్లో తమ సత్తా ఏంటో వారిద్దరూ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు ఉన్న ఇమేజ్‌ వల్ల ఆయన పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)