Breaking News

పదేళ్ల తర్వాత మళ్లీ చాన్స్‌.. ఆనందంలో ప్రగ్యా జైస్వాల్‌

Published on Tue, 05/07/2024 - 11:10

‘కంచె, ఆచారి అమెరికా యాత్ర, అఖండ’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ ఖుషీగా ఉన్నారు. ఆమె ఆనందానికి కారణం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘ఖేల్‌ ఖేల్‌ మే’ సినిమాలో చాన్స్‌ రావడమే. పదేళ్ల క్రితం చేజారిన అవకాశం ఇప్పుడు రావడంతో ప్రగ్యా తన ఆనందాన్ని పంచుకున్నారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్‌ మాట్లాడుతూ– ‘‘అక్షయ్‌ కుమార్‌ హీరోగా దర్శకుడు క్రిష్‌ ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ సినిమా తీశారు. ఆ మూవీ కోసం 2014లో ఆడిష¯Œ  ఇచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం నాకు రాలేదు. అప్పుడు నిరుత్సాహపడ్డాను. అయితే పదేళ్ల తర్వాత ఇప్పుడు అక్షయ్‌గారి ‘ఖేల్‌ ఖేల్‌ మే’లో నటించే చాన్స్‌ రావడం హ్యాపీ. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ముదాస్సర్‌ అజీజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాప్సీ, వాణీ కపూర్‌ నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే... హిందీలో ‘టిటూ ఎమ్‌బీఏ’ (2014) చిత్రంలో హీరోయిన్‌గా నటించారు ప్రగ్యా. బాలీవుడ్‌లో ఆమెకు అది తొలి చిత్రం. పదేళ్లకు ప్రగ్యా మళ్లీ హిందీలో అవకాశం తెచ్చుకున్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)