కాసేపట్లో మరోసారి సీబీఐ ముందుకు విజయ్
Breaking News
సైన్స్ ఫిక్షన్‌లో...
Published on Mon, 01/19/2026 - 03:41
‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’), ‘డ్యూడ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్. తాజాగా ప్రదీప్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను రెడీ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు ప్రదీప్.
ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని నటీనటుల ఎంపికపై ప్రదీప్ దృష్టి పెట్టారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందని, ఒక హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నారని, మరో హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరి కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా కథను శ్రీలీల, మీనాక్షీలకు ప్రదీప్ వినిపించారని సమాచారం మరి... ఈ సైన్స్ ఫిక్షన్స్ సినిమాకు శ్రీలీల, మీనాక్షీ చౌదరి ‘సై’ అన్నారా? లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Tags : 1